స్టార్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సీటీమార్’. వైవిద్యభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.కాగా,అత్యున్నత సాంకేతిక విలువలతో కబడ్డీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. గోపీచంద్, తమన్నా ఇద్దరు కూడా కబడ్డీ జట్ల కోచ్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నాతో పాటు మరో హీరోయిన్గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. ఆంధ్రా జట్టు మహిళా కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ జట్టు మహిళా కబడ్డీ జట్టు కోచ్‌గా తమన్నా నటిస్తున్నారని సమాచారం..
కాగా,ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలపై తాజాగా ఓ అప్డేట్ బయటకొచ్చింది.సీటీమార్ చిత్రాన్ని లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేశారు. మిగతా భాగాన్ని ఇప్పుడు పూర్తి చేసి ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఏప్రిల్ 2 సినిమా విడుదల అవుతుందని వార్తలు రాగా, ఇప్పుడు దానిని కన్ఫాం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, రెహమాన్, బాలివుడ్ యాక్టర్ తరుణ్ అరోరా నటిస్తున్నారు.