Home సినిమాలు లిఫ్ట్‌లో అనసూయకు పురిటినొప్పులు!

లిఫ్ట్‌లో అనసూయకు పురిటినొప్పులు!

టాలీవుడ్ స్టార్ యాంకర్‌ అనసూయ భరద్వాజ్ ముఖ్యపాత్రలో నటిస్తోన్న చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. అనసూయతో పాటు అశ్విన్ విరాజ్ కీలక పాత్ర‌ధారిగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఉత్కంఠ‌భ‌రిత అంశాల‌తో ఒక డ్రామా ఫిల్మ్‌గా నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మేష్ రాప‌ర్తి రూపొందిస్తున్నారు. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ ట్రైల‌ర్‌ను విక్ట‌రీ వెంక‌టేష్ విడుద‌ల చేశారు.ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన అనంతరం వెంకటేష్‌ మాట్లాడుతూ, “థ్యాంక్ యు బ్ర‌ద‌ర్ టైటిల్‌తో పాటు ట్రైల‌ర్ చాలా ఇంట‌రెస్టింగ్‌గా ఉంది. చాలా యునిక్ కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ ర‌మేష్ ఈ సినిమాను చేసిన‌ట్లు అనిపించింది. అశ్విన్ విరాజ్‌, అన‌సూయ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. కరోనా టైమ్‌లో ఈ సినిమాని షూట్ చేశారు. సినిమాలో చాలా స‌స్పెన్స్‌, టెన్ష‌న్ ఉన్నాయి. ఇద్ద‌రు వ్య‌క్తులు ఒక లిఫ్ట్‌లో చిక్కుకుపోతే ఏమ‌వుతుందో అనే యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్‌” అని వెంకీ అన్నారు

ఇక సినిమా ట్రైలర్ విషయానికొస్తే,ప్రెగ్నెంట్ గా ఉన్న అన‌సూయ లిఫ్ట్ లో వెళ్తుండ‌గా విరాజ్ అశ్విన్ అదే లిఫ్ట్‌లో ఉంటాడు. అనసూయ తాగుతున్న వాటిల్ బాటిల్  లోని నీళ్లు విరాజ్ పై ప‌డ‌గా..అత‌ను అన‌సూయ‌పై చిరాకు ప‌డే స‌న్నివేశంతో ట్రైల‌ర్ ప్రారంభం అవుతుంది. మ‌ధ్య‌లో స‌డెన్ గా లిఫ్ట్ తెగి కింద‌ప‌డుతుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది స‌స్పెన్స్ గా ఉంది. అలాగే “నిన్ను క‌నేట‌ప్ప‌డు ప‌డ్డ పురిటినొప్పులు ఇప్ప‌టికీ ప‌డుతూనే ఉన్నాను” అనిని అభి త‌ల్లి చెప్తున్న మాట‌ల్ని బ‌ట్టి అతడి క్యారెక్ట‌ర్ ఎలాంటిదో అర్థ‌మ‌వుతుంది. అలాంటివాడు లిఫ్ట్‌లో త‌న‌తో పాటు చిక్కుకున్న ప్రెగ్నెంట్ లేడీతో ఎలా ప్ర‌వ‌ర్తించాడు, ఏం చేసాడనేది ఉత్కంఠభరితంగా ఉంది.కాగా,ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల‌ చేసేందుకు  స‌న్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

అత్యంత ప్రముఖమైనవి

కరోనా వాక్సిన్ ధర – 250/- గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా కొత్త స్ట్రైన్ వ్యాపించే అవకాశం ఉన్నందున, కేంద్రం వాక్సిన్ ను పబ్లిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగం గా ధరను 250 రూపాయలుగా నిర్ణయించింది. ...

‘మాస్టర్’ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్‌ చేసింది. బాహుబలి 2తో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్‌...

ఇండియా లెజెండ్స్ క్రికెట్ – మార్చ్ 5 నుంచి

రహదారి భద్రతా ప్రపంచ సిరీస్ లో భాగం గా మార్చ్ 5 న ఈ సిరీస్ ప్రారంభమవుతోంది.  ఆయా దేశాల మాజీ క్రికెటర్ లు ఈ సిరీస్ లో ఆడనున్నారు. ...

మహిళల అంతర్జాతీయ క్రికెట్ దక్షిణ ఆఫ్రికా తో సిరీస్ – మార్చ్ 7 నుంచి

భారత మహిళల జట్టు అంతర్జాతీయ క్రికెట్ దక్షిణ ఆఫ్రికా తో సిరీస్ తో ఆరంభమవుతోంది.  బి సీ సీ ఐ వన్ డే మరియు టి 20ల మహిళా జట్లను...

ఇటీవలి వ్యాఖ్యలు