మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘గని’అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తుండగా, రెనైసెన్స్ పిక్చర్స్ పతాకంపై సిద్ధు, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.కాగా,తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్న విషయాన్ని చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జులై 30న ‘గని’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొంది.
కాగా,ఈ సినిమాలో వరుణ్ తండ్రిగా ఉపేంద్ర, కోచ్‌గా సునీల్ శెట్టి, విలన్ గా జగపతిబాబు నటించనున్నారు. బాలీవుడ్ దర్శకనటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయూ మంజ్రేకర్ హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుండగా..నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు..ఇక వరుణ్‌తేజ్ మరోవైపు వెంకటేష్‌తో కలిసి ‘ఎఫ్3’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల మందుకు రానుంది.