ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ ఫైటింగ్ సన్నివేశాన్ని రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో త్వరలో సినీ నటుడు ప్రభాస్, ఇతర చిత్రబృందం ఆడుగుపెట్టనుంది. బొగ్గుగని ప్రాంతంలో ఫైట్ సీన్లు తెరకెక్కించనున్నారు. ఈ మేరకు ఓపెన్‌కాస్ట్ ప్రాంతంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.తాజాగా చిత్ర బృందం ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద సెట్టింగ్ పనులు మొదలుపెట్టారు.హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు.
కాగా,ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా దిశా పటానీ, శృతి హాసన్‌ల పేర్లు వినిపించగా, చివరికి శృతి హాసన్‌కి ఆ అవకాశం దక్కింది. ఈ రోజు శృతి 35వ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్‌తో తొలిసారి శృతి హాసన్ నటిస్తున్న నేపథ్యంలో ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, శృతి హాసన్ నటించిన క్రాక్ చిత్రం ఇటీవల విడుదలై మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే.