యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 13న ‘ఆర్ఆర్ఆర్’ను విడుదల చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిష్టాత్మక సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు తీపి కబురు చెప్పినట్లైంది.
కాగా,భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామరాజుగా మ్ రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్, హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కీలకదశలో ఉంది.
కాగా,ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ సందడి చేయనున్న విషయం తెలిసిందే.ఇందులో ఆమె ఎన్టీఆర్ ప్రేయసిగా జెన్నీఫర్ పాత్రలో కనిపించనున్నారు. శుక్రవారం ఒలీవియా మోరీస్ పుట్టినరోజు సందర్భంగా.. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. అనంతరం ఎన్టీఆర్ సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘హ్యాపీ బర్త్‌డే డియర్ జెన్నీఫర్’ అని ట్వీట్ చేశారు.