మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం “ఆచార్య”. ఈ సినిమా నుంచి అప్డేట్ ఉండబోతుందని గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఆ మరుసటి రోజే టీజర్ డేట్ రివీల్ చేసింది. జనవరి 29న సాయంత్రం 4.05 గంటలకు టీజర్ విడుదల చేస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి అభిమానులు టీజర్ కోసం ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఈ ‘ఆచార్య’ టీజర్‌ను విడుదల చేశారు చిత్రబృందం.
“ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు” అంటూ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ వాయిస్‌తో ప్రారంభమైన టీజర్ ఆసక్తికరంగా సాగింది. దేవాలయాలు, వాటిపై జరిగే అన్యాయాలపై పోరాడే వ్యక్తిగా మెగాస్టార్ ఇందులో కనిపించారు. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెబుతాననేమో’ అంటూ చివర్లో చిరంజీవి తనదైన డైలాగ్‌తో దుమ్మురేపారు.కాగా,మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడెక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.