Home సినిమాలు మళ్లీ ప్రేమలో పడిన శృతి హసన్: వైరల్ ఫోటో..

మళ్లీ ప్రేమలో పడిన శృతి హసన్: వైరల్ ఫోటో..

క్రాక్‌లో మాస్‌ యాంగిల్‌లో నటించి ప్రేక్షకులతో ఈలలు కొట్టించుకుందీ శృతి హాసన్‌. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా గాయని, డ్యాన్సర్‌, సంగీత దర్శకురాలు, నిర్మాత.. ఇలా అన్ని రంగాల్లోనూ ఆమెది అందె వేసిన చేయి. కాగా,కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రేమలో పడి ఒడిదొడుకులకు లోనైన ఆమె బ్రేకప్‌ తర్వాత కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఫలితంగా ‘కాటమరాయుడు’ విడుదలైన మూడేళ్ల తర్వాత ‘క్రాక్’‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఒక్కసారి నటించడం మొదలు పెడితే తనతో ఎవరూ పోటీకి రాలేరు అన్నట్లుగా మాస్ యాంగిల్‌ చూపిస్తూ జనాలతో ఈలలు వేయించింది.ఇక శ్రుతి ఇటీవల తన 35వ పుట్టిన రోజును స్నేహితులు మధ్య సెలబ్రెట్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్‌ చేశారు. దీంతో ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి

కాగా, ఈ ఫోటోల్లో శృతి ఓ వ్యక్తిని హత్తుకుని అత్యంత సన్నిహితంగా కనిపించారు. అంతేగాక ఈ ఫొటోలను షేర్‌ చేస్తూ ‘నా పుట్టిన రోజును ప్రత్యేకంగా మలచినందుకు ధన్యవాదాలు శాంతను’ అంటూ ట్యాగ్‌ చేశారు. దీంతో ఆ వ్యక్తి శృతి కొత్త బాయ్‌ఫ్రెండ్ అయింటాడని నెటిజన్లు అభ్రిప్రాయపడుతున్నారు. అయితే అతడి పేరు శాంతను హజారికా. అతడు ఓ పెయింటర్‌. శృతి బర్త్‌డేను దగ్గరుండి అతడే సెలబ్రెట్‌ చేశాడంట. ఇక అతడిని శాంతను అంటూ శృతి ముద్దుగా పిలవడంతో ఆమె మళ్లీ ప్రేమలో ఉన్నారని ఫిక్స్‌ అయిపోతున్నారు. కాగా 2016లో లండన్‌ నటుడు మైఖేల్‌ కర్సెల్‌తో శృతి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019లో వారిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సుకుమార్ కూతురి వేడుక‌లో ఎన్టీఆర్, మహేష్, చై ఫ్యామిలీస్ సందడి.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్‌లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్యా నమ్రతతో కలిసి సందడి చేయగా.. నాగచైతన్య,...

కృతి శెట్టికి క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన ‘ఉప్పెన’ బ్యూటీ

'ఉప్పెన' సినిమాలో హీరోయిన్‌గా నటించిన యువ నటి కృతి శెట్టి ఎలాంటి నటన కనబర్చిందనేది అందరికీ తెలుసు. రొమాంటిక్ సీన్స్, సెంటిమెంటల్ సీన్స్ ఇలా అన్ని కోణాల్లో ఆమె చూపించిన...

‘ఆచార్య’ సెట్స్ లో సందడి చేసిన చిరు, చరణ్.. వైరల్‌ ఫోటోలు

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక మే 13న ప్రపంచ...

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఇటీవలి వ్యాఖ్యలు