Home సినిమాలు మహేశ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌: ‘సర్కారువారి పాట’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

మహేశ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌: ‘సర్కారువారి పాట’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌‌ బాబు అభిమానులకు గుడ్‌ న్యూస్‌. ఆయన తాజాగా నటిస్తున్న‘సర్కారు వారి పాట’ ఎప్పుడేప్పుడు విడుదల ఆవుతుందా అని ఎదురు చూస్తు‍న్న అభిమానులకు మైత్రీ మూవీస్‌ సర్‌ప్రైజ్‌ అందించింది.ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైన చిత్రీకరణ ఇటీవల దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తాళాల గుత్తి పట్టుకున్న మహేశ్‌ చేతి పోస్టర్‌ను విడుదల చేశారు.మైత్రీమూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. గతేడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మహేశ్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

కాగా మ‌హేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్‌  మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు. అంతేగాక ఇతర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.

అత్యంత ప్రముఖమైనవి

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు