Home సినిమాలు మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ‘ఆచార్య’ విడుదల తేదీ చెప్పిన‌ కొరటాల శివ

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ‘ఆచార్య’ విడుదల తేదీ చెప్పిన‌ కొరటాల శివ

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్‌ ‘ఆచార్య’. ఇందులో చరణ్‌ ‘సిద్ధ’గా కీలకపాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌లో చరణ్‌ పాల్గొంటున్నారు. తాజాగా విడుదలైన ‘ఆచార్య’ టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.

కాగా,’ఆచార్య’ సినిమా విడుదల తేదీని తాజాగా దర్శక నిర్మాతలు ప్రకటించారు. టీజర్‌లో సమ్మర్ విడుదల అని చెప్పిన మేకర్స్..మే 13న ఈ సినిమా విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని వెల్లడించారు.ఇక ‘ఆచార్య’సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. మరోవైపు శుక్రవారం(జనవరి 29) సాయంత్రం 4:05 గంటల విడుదలైన ‘ఆచార్య’ టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. విడుదలై 30 నిమిషాల్లోనే లక్షా ఎనభై వేలకు పైగా వ్యూస్‌ అందుకుంది.అలాగే లక్షన్నరకు పైగా లైకులు సాధించింది. విడుదలైన నిమిషాలకే లక్షల్లో వ్యూస్‌ వస్తే.. గంటలు, రోజుల్లో మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అని మెగా ఫ్యాన్స్‌ ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు