‘గ్యాంగ్‌లతో వచ్చేవాడు గ్యాంగ్‌స్టర్.. కానీ అతనొక్కడే వస్తాడు.. మాన్స్టర్’.. ‘కేజీయఫ్-1’లో ఈ ఒక్క డైలాగ్ చాలు రాకీ పాత్రను ఏ స్థాయిలో హైలైట్ చేశారో అర్థమవుతుంది.టీజర్‌తోనే భారతీయ సినిమా ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించిన ఈ సినిమాను జులై 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది చిత్రబృందం.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. సంజయ్‌దత్, రవీనా టాండన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
కాగా,కేజీయఫ్ చాప్టర్-1లో మిగిలిన చాలా ప్రశ్నలకు ఈ సినిమాలో జవాబు దొరకనుంది. గరుడను చంపడానికి కేజీయఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు..కేజీయఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్, కమల్, గురు పాండ్యన్, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు..గరుడ వేసిన పథకం ప్రకారం చనిపోయిన అధీర ఎలా తిరిగొచ్చాడు.. భారత దేశంలోకి ప్రవేశించడానికి ఇనాయత్ ఖలీ ఏం చేశాడు.. కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాకీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది..వంటి ప్రశ్నలకు కేజీయఫ్2 లో సమాధానం లభించనుంది.Attachments area