నటీనటులు : ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్, శుభలేఖ సుధాకర్, పోసాని కృష్ణమురళి, హేమ, వైవా హర్ష హైపర్ ఆది తదితరులుదర్శకత్వం : మున్నా ధూళిపూడిసంగీతం : అనూప్ రూబెన్స్నిర్మాత : ఎస్వీ బాబు
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనేది థియేటర్ల సాక్షిగా అభిమానులకు నేర్పించాడు స్టార్ యాంకర్ ప్రదీప్. ఆయన హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?”. ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.అయితే ఇన్నేళ్ళుగా యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్ వెండి తెరపై ఎలా అలరించాడు?అనేది రివ్యూలో చూద్దాం…
కథ:
స్వాతంత్ర్యం రాక ముందు ఒక ఊరిలో అబ్బాయి గారు (ప్రదీప్), అమ్మాయి గారు (అమృత అయ్యర్) అనే యువతీయువకులు ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ అనుకోకుండా ఒకరిపై ఒకరు కోపంతో చనిపోతారు. ఆ తర్వాత మళ్లీ జన్మలో అర్జున్(ప్రదీప్ మాచిరాజు), అక్షరగా(అమృతా అయ్యర్) పుడతారు.అయితే అర్జున్ కి చదువంటే ఇష్టం ఉండదు కానీ బాక్సింగ్ అంటే ప్రాణం.ఇక అక్షరకి చదువంటే చాలా ఇష్టం.అయితే ఒకే కాలేజీలో చదువుతున్న అర్జున్‌కి,అక్షరకి . ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. కానీ అనుకోకుండా వీరిద్దరు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ వీరిద్దరికి ఓ పెద్ద సమస్య ఎదురువుతోంది. ఆ సమస్యకు పరిష్కారమేంటో స్వామిజీ(శుభలేక సుధాకర్) చెప్తాడు. దీంతో వీరిద్దరు ఇష్టంలేకున్నా 30 రోజుల్లో ప్రేమించుకోవాల్సి వస్తోంది. అసలు వీరిద్దరికి ఎదురైన సమస్య ఏంటి? చివరకు వీరి సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
ప్రేమతో చచ్చిపోయి.. వచ్చే జన్మలో కలవడం కామన్ పాయింట్. కానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో మాత్రం కోపంతో చనిపోయి మళ్లీ పుట్టడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే దర్శకుడు ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు..కానీ ఆ కథని తెరపై చూపించడంతో కాస్త తడబడ్డాడు. నేటి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చిన ప్రేమ సన్నివేశాలు కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధండా ఉండవు. అలాగే సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి తప్ప, ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేవిధంగా అనిపించవు. సీరియస్ కథ అయినా.. కామెడీతో నడిపించేప్రయత్నం చేసి కాస్త విఫలమయ్యాడు.
నటీనటులు:
యాంకర్ ప్రదీప్ హీరోగా బాగానే ఉన్నాడు. బుల్లితెరపై స్టార్ అయినా వెండితెరపై మాత్రం నటనలో ఇంకా మెలుకువలు నేర్చుకోవాలి.ఇక హీరోయిన్ అమృత అయ్యర్ అద్భుతంగా నటించింది ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అమృత నటన అని చెప్పొచ్చు..ఇక పోసాని కృష్ణమురళి, హేమల అనుభవం మరోసారి తెరపై చూడొచ్చు. వైవా హర్ష తనదైన కామెడీతో అందరిని నవ్వించేశాడు. హైపర్ ఆది, మహేశ్, శుభలేఖ సుధాకర్ తమ పాత్రలపరిధి మేర ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్ :హీరో,హీరోయిన్ల నటనసంగీతంకామెడీ
మైనస్ పాయింట్స్:కథ,కథనం
రేటింగ్:2.75