‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు..’ అంటూ ఇటీవల అభిమానుల్ని ఫిదా చేశారు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. ఆయన కథానాయకుడిగా రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు.మరోసారి జోడీగా ఈ చిత్రంలో పవన్, శృతిహాసన్ కలిసి నటించనున్నారు.హిందీలో వచ్చిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్’పై భారీ అంచనాలే ఉన్నాయి.
కాగా,ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు.అయితే,ఈ ‘వకీల్‌సాబ్’ సినిమాను ఉగాది కానుకగా ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటుంది.