మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా తెరకెక్కనున్న కొత్త సినిమా ‘ఖిలాడి’. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ క్లాస్+మాస్ లుక్లో సినీ ప్రియులను ఆకట్టుకునేలా కనిపించారు. రవితేజ 67వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాలో డింపుల్ హయాతీ, మీనా చౌదరి కీలకపాత్రలు పోషించనున్నారు.ఇటీవల విడుదలైన రవితేజ ఎంట్రీ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది
కాగా, ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించనున్నారని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ మధ్యకాలంలో అర్జున్ అటు తమిళ, ఇటు తెలుగు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు.కాగా,‘ఖిలాడి’చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా పెన్ స్టూడియోస్ పతాకంపై కోనేరు సత్యనారయణ నిర్మిస్తున్నారు.