Home సినిమాలు రవితేజ 'ఖిలాడి'.. రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

రవితేజ ‘ఖిలాడి’.. రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

‘క్రాక్‌’ హిట్‌ మాస్‌ మహారాజా రవితేజలో ఫుల్ జోష్‌ని నింపింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది.ఇప్పుడు ఇదే జోష్ లో తన తదుపరి సినిమా ‘ఖిలాడి’ మొదలు పెట్టేశాడు. రమేశ్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఇందులో రవితేజ డ్యూయోల్ రోల్‏లో నటించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాగా,ఖిలాడిలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించింది చిత్ర యూనిట్‌. మే 28న థియేటర్లలలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు చేతిలో‌ గన్‌ పట్టుకొని రవితేజ నడుచుకుంటూ వస్తున్న కొత్త పోస్టర్‌ను పరిచయం చేస్తూ ‘ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో మే 28 నుంచి ఖిడాడీ రిలీజ్‌ కానుంది’ అని రవితేజ ట్విటర్‌లో పేర్కొన్నారు.

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు