Home సినిమాలు 'సలార్‌' కోసం శృతి హాసన్‌ భారీ రెమ్యునరేషన్‌!

‘సలార్‌’ కోసం శృతి హాసన్‌ భారీ రెమ్యునరేషన్‌!

పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా రానున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. కన్నడ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రుతిహాసన్‌కు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో తొలుత దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుందన్న టాక్‌ నడిచింది.. కానీ అనూహ్యంగా శృతి హాసన్‌ పేరు పరిశీలనలోకి రాగా ఆమెను ఫైనలైజ్‌ చేశారు. ఇందుకోసం ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు సమాచారం గత కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన శృతి ఈ మధ్య కాలంలో  అందుకుంటున్న అతి పెద్ద పారితోషికం ఇదేనని తెలుస్తోంది. కాగా,తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. ఇటీవల మాస్‌ మహారాజా రవితేజతో నటించిన ‘క్రాక్’‌ చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లక్‌బస్టర్‌గా నిలిచింది.

కాగా,’సలార్’ సినిమాలో మొదటి సన్నివేశాన్ని రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారు.ఈమేరకు ఓపెన్‌ కాస్ట్‌ ప్రాంతంలో సెట్‌ సిద్ధం చేయగా ప్రభాస్‌, చిత్రయూనిట్‌తో కలిసి గోదావరిఖని చేరుకున్నాడు. పోలీస్‌ కాన్వాయ్‌ మధ్య అతడిని బొగ్గు గనికి తీసుకువెళ్లారు. ప్రభాస్‌ వస్తున్నాడని తెలిసి అభిమానులు దారిపొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సలార్‌ సెట్స్‌లో ప్రభాస్‌ అడుగు పెట్టిన వీడియో కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. సుమారు పది రోజుల పాటు ఇక్కడ షూటింగ్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్‌ గౌడ, సంగీతం రవి బస్రూర్‌ అందిస్తున్నారు

అత్యంత ప్రముఖమైనవి

భారీగా కరిగిన ఎల‌న్ మస్క్‌ సంపద.. కారణం ఇదే!

ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. గడిచిన వారం రోజుల్లో భారీగా నష్టపోయారు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన...

శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌ చిరంజీవి..

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు....

అరణ్య మూవీ నుంచి అరణ్య గీతం

ప్రభు సాల్మన్ దర్శకత్వం లో దగ్గుబాటి రానా కీలక పాత్రలో వస్తున్న చిత్రం అరణ్య.  ఈ చిత్రం లో ఒక పాటని అరణ్య గీతం పేరుతో ఈ చిత్ర బృందం...

సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే.. గుణశేఖర్ స్కెచ్ మామూలుగా లేదు!

గతంలో తెలుగుచిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన భారీ సెట్ల దర్శకుడు గుణశేఖర్‌కి ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. వరుస ఫ్లాపుల కారణంగా అగ్రహీరోలు ఆయన్ని పక్కన పెట్టేయగా.. యంగ్ హీరోలు కూడా...

ఇటీవలి వ్యాఖ్యలు