మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన. కీర్తీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఉప్పెనకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఇటీవల విడుదల అయిన ఉప్పెన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే ఇప్పటికే విడుదలైన మూడు పాటలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఈ తర్వాత విడుదలైన ‘దక్ దక్ దక్’ పాట కూడా అంతే హిట్ గా నిలిచింది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘జల జల జలపాతం నువ్వు.. సెల సెల సెలయేరు నేను…’ సాంగ్‌ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటను జస్ప్రీత్ జస్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. కాగా,ఉప్పెనను ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.