యువ హీరో కార్తికేయ గుమ్మకొండ, టాలెంటెడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా ‘చావు కబురు చల్లగా’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనున్నట్టు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ‘పూర్తి వినోదానికి సిద్ధం కండి’ అంటూ ట్వీట్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జేక్స్‌బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.డిఫరెంట్ టైటిల్లో వస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నర్సుగా నటిస్తుండగా, బస్తీ బాలరాజు రోల్లో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రబృందం.కాగా,తాజాగా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లో లావణ్య, కార్తికేయ బెక్‌పై కూర్చొని ఉన్నారు. బైక్ వెనకాల కూర్చున్న లావణ్యను టచ్ కాకుండా.. కార్తికేయ బైక్ ట్యాంక్ పై కూర్చొని నవ్వుతూ డ్రైవ్ చేస్తున్నాడు. మరి కార్తికేయ అలా ఎందుకు బైక్ నడపాల్సివచ్చిందో తెలియాలంటే మార్చి 19 వరకు వెయిట్ చేయాల్సిందే.