బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ కథాంశంతో వస్తోన్న ఈ సినిమా స్పెషల్ గ్లిమ్స్ చూసి అభిమానులు ఎంతో ఆనందించారు.సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే తాజాగా చిత్రబృందం ఓ ఆసక్తికరమైన వార్తను అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.కాగా,బోయపాటి శ్రీను- బాలకృష్ణ జోడి గురించి చెప్పాల్సిందేముంటుంది. వీళ్లిద్దరూ కలిశారంటే రికార్డుల మోత అనాల్సిందే. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఇవి రెండూ బాలకృష్ణలోని నట విశ్వరూపాన్ని చూపించాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈసారీ యాక్షన్ నేపథ్యమే అయినా వైవిధ్యంగా ఉండేందుకు బాలయ్యను అఘోరా పాత్రలో చూపించబోతున్నారు బోయపాటి. దాంతో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ పెరిగింది.