Home సినిమాలు #NTR30: ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ భామ

#NTR30: ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ భామ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో #NTR30 గురించి సినీ ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ కథానాయికగా బాలీవుడ్‌ బ్యూటీ వరీనా హుస్సేన్‌ను తీసుకోవాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారట. ఇప్పటికే ఆమె ఫొటోషూట్‌ చూసి ఆమెను హైదరాబాద్ రప్పించాడట. దీంతో వరీనా హైదరాబాద్‌కు వచ్చిందని సమాచారం.

వరీనా నటన పట్ల త్రివిక్రమ్‌ సుముఖత వ్యక్తం చేశారని దీంతో ఆమెకు ఈ సినిమాలో ఓ పాత్రను ఇచ్చారని సమాచారం. లవ్ యాత్రి సినిమాతో ఉత్తరాది ఆడియన్స్‌ను అలరించిన ఈ అమ్మడు ఎన్టీఆర్ 30 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా..ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా పూజాహెగ్డేను తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను ఉగాది పండుగకు షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు