దక్షిణాది తారల్లో సాయిపల్లవికి ప్రత్యేక స్థానం ఉంది. అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులతో యూత్‌ను ఫిదా చేసిన ఈ రౌడీబేబీ, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఎంతో దగ్గరైంది. కమర్షియల్ యాడ్స్‌లో నటించి లక్షలాది రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా, వాటికి నో చెప్పి తన ప్రత్యేకతను చాటుకుంది.కాగా, సాయి పల్లవి కెరీర్ మంచి పీక్స్‌లో ఉంది. వరుస అవకాశాలతో భారీ ప్రాజెక్ట్స్ ఆమె ముంగిట నిలుస్తున్నాయి.
అయితే,ఇప్పుడు సాయి పల్లవి టాలీవుడ్లో అగ్ర హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. అయ్యప్పనుమ్ కొషియుమ్ తెలుగు రీమేక్‌లో సాయిపల్లవి నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.కాగా,తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ భార్య పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. మరికొన్ని రోజుల్లో సాయిపల్లవి షూటింగ్ లో పాల్గొనున్నట్టు తెలుస్తోంది.కాగా,ఈ చిత్రంలో అయ్యప్పన్ నాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తోండగా.. కొషీ పాత్రను రానా చేస్తున్నాడు. అయితే ఇప్పటికే రానా వైఫ్ పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ ఫిక్స్ అవ్వగా.. సముద్రఖని రానా తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.