మహాభారతంలో కృష్ణుడు కౌరవులు వైపు ఉంటే: కార్తి ‘సుల్తాన్’ టీజర్ చూశారా?
‘ఖైదీ’ అనే మంచి థ్రిల్లర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో కార్తి.. ఇప్పుడు ‘సుల్తాన్’ అనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కార్తి, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన ‘సుల్తాన్’ సినిమాకు ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు.ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైన్‌ర్‌గా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాతో రశ్మిక తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు.వివేక్ మెర్విన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది.ఈ సందర్భంగా ‘సుల్తాన్’ టీజర్‌ను విడుదల చేశారు చిత్రబృందం.ఇందులో పాండవులు ఎవరు? కౌరవులు ఎవరు? మరి ఈ కలియుగ మహాభారతంలో కృష్ణుడు ఎవరి పక్షాన నిలబడ్డాడు?తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కాగా,కొంతకాలం కిందట కార్తి చేసిన ‘దేవ్’, ‘దొంగ’ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. కానీ, ‘ఖైదీ’ మాత్రం కాసుల వర్షం కురిపించింది. అయితే, ‘ఖైదీ’ తరవాత భారీ అంచనాలతో విడుదలైన ‘దొంగ’ పెద్దగా ఆకట్టుకోకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది. మరి, ఇప్పుడు ఈ ‘సుల్తాన్’తో మరోసారి కార్తి మెప్పిస్తారో లేదో చూడాలి.