‘హిట్’ వంటి హిట్ చిత్రం తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పాగల్’. ఈ చిత్రం ద్వారా నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రథన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.విశ్వక్ సేన్ సరసనహీరోయిన్ గా కొత్త అమ్మాయిని ఎంపిక చేసినట్టు సమాచారం.తాజాగా ‘పాగల్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్రబృందం. ఇందులో విశ్వక్ సేన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తూ అభిమానులకి ఆనందాన్ని అందిస్తున్నాడు.
కాగా,ఏప్రిల్ 30న ‘పాగల్’ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకు రానున్నట్టు మేకర్స్ ఫస్ట్ లుక్ ద్వారా తెలియజేశారు. “హిట్” కు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా అద్భుతమైన విజువల్స్ అందించిన మణికందన్ మరొకసారి ఈ సినిమాకు పని చేస్తూ ఉండగా, “గూఢచారి” వంటి సెన్సేషనల్ హిట్ సినిమాలతో పాటు ప్రస్తుతం వస్తున్న అనేక హిట్ సినిమాలకు ఎడిటింగ్ చేస్తున్న గ్యారీ సర్ పాగల్‌కు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.ఈ నేపథ్యంలో బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘విశ్వక్‌తో ‘పాగల్’ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.ఒక క్రేజీ సబ్జెక్టుతో ఈ చిత్రం తీస్తున్నాం. నరేష్ లాంటి ప్రతిభావంతుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు.‘‘నరేష్ చెప్పిన స్క్రిప్ట్ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో ‘పాగల్’ చిత్రాన్ని అంగీకరించా. సరికొత్త జానర్లో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు విశ్వక్సేన్.