Home సినిమాలు 'హరిహర వీరమల్లు' పవన్-క్రిష్ సినిమాకు ఆసక్తికర టైటిల్ !

‘హరిహర వీరమల్లు’ పవన్-క్రిష్ సినిమాకు ఆసక్తికర టైటిల్ !

పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏయం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్లు గా ఇస్మార్ట్‌ బ్యూటీ నిధీ అగర్వాల్‌,బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ కనిపిస్తారని సమాచారం.ఇందులో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగ పాత్రలో కనిపించబోతున్నాడని, ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని ఇన్ని రోజులు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ టైటిల్ ఇప్పటికే ఓ దర్శకుడు రిజిస్టర్ చేయించుకోవడంతో క్రిష్ వెనక్కి తగ్గారని తెలుస్తోంది.

కాగా,టైటిల్ విషయమై చిత్ర నిర్మాతలు, పవన్ కళ్యాణ్‌తో చర్చించి చివరకు ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ ఖరారు చేశారని సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.మరోవైపు పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌ సాబ్’‌ సినిమా విడుదల తేదీని ఇటీవల ప్రకటించారు. ఉగాది కానుకగా ఏప్రిల్‌ 9న థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటుంది.

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు