Home సినిమాలు చిరు ‘ఆచార్య’లో మరో స్టార్‌ హీరో!

చిరు ‘ఆచార్య’లో మరో స్టార్‌ హీరో!

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది.కాగా,ఇటీవల విడుదలైన ఆచార్య టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. టీజర్‌లో చిరంజీవి, రామ్‌ చరణ్‌ చెప్పిన డైలాగులు అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇక టీజర్‌.. సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.  అలాగే రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నెట్టింట్లో ఓ వైపు టీజర్‌ హవా నడుస్తుండగానే రిలీజ్‌ డేట్‌ కూడా కన్ఫార్మ్‌ చేయడంతో చిరంజీవి అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.

అయితే తాజాగా ఆచార్యలో మరో స్టార్‌ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్‌ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్ల తెలుస్తోంది. అయితే సుదీప్‌ తెలుగు సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే నాని హీరోగా వచ్చిన ఈగ సినిమాలో విలన్ గా అలరించిన సుదీప్‌ ఆ తరువాత ప్రభాస్‌ నటించిన బాహుబలిలోనూ ఓ పాత్ర పోషించారు. అంతేగాక చిరంజీవి సైరా నర్సింహరెడ్డి సినిమాలో కూడా సుదీప్‌ ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆచార్యలో కూడా నటించాల్సిందిగా చిత్రబృందం కోరడంతో.. నటించేందుకు సుదీప్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, మే 13న ప్రపంచ వ్యాప్తంగా ‘ఆచార్య’ విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

భారీగా కరిగిన ఎల‌న్ మస్క్‌ సంపద.. కారణం ఇదే!

ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. గడిచిన వారం రోజుల్లో భారీగా నష్టపోయారు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన...

శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌ చిరంజీవి..

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు....

అరణ్య మూవీ నుంచి అరణ్య గీతం

ప్రభు సాల్మన్ దర్శకత్వం లో దగ్గుబాటి రానా కీలక పాత్రలో వస్తున్న చిత్రం అరణ్య.  ఈ చిత్రం లో ఒక పాటని అరణ్య గీతం పేరుతో ఈ చిత్ర బృందం...

సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే.. గుణశేఖర్ స్కెచ్ మామూలుగా లేదు!

గతంలో తెలుగుచిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన భారీ సెట్ల దర్శకుడు గుణశేఖర్‌కి ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. వరుస ఫ్లాపుల కారణంగా అగ్రహీరోలు ఆయన్ని పక్కన పెట్టేయగా.. యంగ్ హీరోలు కూడా...

ఇటీవలి వ్యాఖ్యలు