Home సినిమాలు 'పుష్ప' షూటింగ్ లో బన్నీ: ఫ్యాన్స్‌తో నిండిపోయిన రంపచోడవరం

‘పుష్ప’ షూటింగ్ లో బన్నీ: ఫ్యాన్స్‌తో నిండిపోయిన రంపచోడవరం

ఆంధ్రప్రదేశ్ లోని రంపచోడవరం జంక్షన్ మంగళవారం రాత్రి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో నిండిపోయింది. తమ అభిమాన హీరో వచ్చాడని తెలిసి వేలాదిగా మెగా ఫ్యాన్స్ రంపచోడవరం జంక్షన్‌కు తరలివచ్చారు. సెల్‌ఫోన్ వెలుగుల్లో బన్నీని చూసుకుని ఆనందపడ్డారు. కారు రూఫ్ టాప్‌లో నుంచి బయటికి వచ్చిన అల్లు అర్జున్.. తనకోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఒక ఫొటోను బన్నీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ‘థాంక్ యూ రంపచోడవరం’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

కాగా,అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ గత నెల రోజులుగా రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి ఆటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ మంగళవారం పూర్తయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, ‘పుష్ప’ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.ఆగస్టు 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

మెగా డాట‌ర్ నిహారిక కొత్త సినిమా.. ముఖ్య పాత్రలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆరుముగ కుమార్‌...

‘నాంది’ 7 రోజుల కలెక్షన్స్: మోత మోగిస్తోన్న అల్లరోడు

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఉవ్విళ్లూరుతున్నాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో...

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణ మురళీ తదితరులు నిర్మాతలు : వి. ఆనంద...

ఆస్కార్ రేసులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’.. పట్టరాని ఆనందంలో అభిమానులు

సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'.  లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య...

ఇటీవలి వ్యాఖ్యలు