Home సినిమాలు ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’లో మరో బాలీవుడ్‌ హీరో!

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’లో మరో బాలీవుడ్‌ హీరో!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా 3డీ చిత్రం ‘ఆదిపురుష్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.రామాయాణం కథాంశంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీరాముని పాత్రలో ప్రభాస్‌, రావణుని పాత్రలో సైఫ్‌అలీఖాన్ నటిస్తుండటం విశేషం.చిత్రంలో సీత పాత్రకు బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.మొత్తం ఐదు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే వీఎఫ్‌ఎక్స్‌ పనులను ప్రారంభించారు. టి-సిరీస్‌, రెట్రో పిల్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

కాగా,‘ఆదిపురుష్‌’ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ సైతం నటించనున్నట్లు సమాచారం. పరమశివుడి పాత్రను ఆయన పోషించనున్నట్లు తెలుస్తోంది. ఓంరౌత్‌ దర్శకత్వంలో అజయ్‌ దేవ్‌గణ్‌ కథానాయకుడిగా నటించిన ‘తన్హాజీ’ చిత్రం గతేడాది బాలీవుడ్‌లో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే అజయ్‌ దేవ్‌గణ్‌ ఓం రౌత్‌తో మంచి సంబంధాలుండడంతో ఆ పాత్రను చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. కాగా, ఇప్పటి వరకు దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.మరోవైపు అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రస్తుతం తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోనూ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

మెగా డాట‌ర్ నిహారిక కొత్త సినిమా.. ముఖ్య పాత్రలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆరుముగ కుమార్‌...

‘నాంది’ 7 రోజుల కలెక్షన్స్: మోత మోగిస్తోన్న అల్లరోడు

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఉవ్విళ్లూరుతున్నాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో...

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణ మురళీ తదితరులు నిర్మాతలు : వి. ఆనంద...

ఆస్కార్ రేసులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’.. పట్టరాని ఆనందంలో అభిమానులు

సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'.  లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య...

ఇటీవలి వ్యాఖ్యలు