Home సినిమాలు అఖిల్ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

అఖిల్ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

యంగ్ హీరో అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’.బొమ్మరిల్లు ‘భాస్కర్’‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తున్నారు..ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కాగా,భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, జోష్ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే  గోపీ సుంద‌ర్ సంగీత‌ సారథ్యంలో సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో మంచి స్పందన లభించింది.ఇదే జోష్ లో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల పోస్టర్ రిలీజ్ చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో పూజ, అఖిల్ ఇద్దరూ రొమాంటిక్ గా అలా ఒకరినొకరు చూస్తున్నారు. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు.

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు