యువకథానాయకుడు నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ‘చెక్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. పోసాని కృష్ణమురళి, మురళీశర్మ కీలకపాత్రల్లో నటించారు. కళ్యాణిమాలిక్ సంగీతం అందించారు.భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 19న చిత్రం విడుదల కానుంది. జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. కాగా.. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.
‘యద్భావం తద్భవతి.. అణువు నుంచి అనంతం వరకు ఏదీ కర్మను తప్పించుకోలేదు’ అని మురళీ శర్మ వాయిస్‌తో మొదలైన ట్రైలర్ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ లి ప్రతి చిన్న డైలాగ్ అద్భుతంగా ఉంది. జైల్లో మరో ఖైదీతో మొదలైన నితిన్ ‘చెక్’.. జాతీయ స్థాయికి వెళ్తుంది. ‘ఒక టెర్రరిస్ట్‌తో చెస్ ఆడిస్తారా’ అంటూ మరో చెస్ ప్లేయర్ అనడం నితిన్‌కు ఎదురయ్యే అడ్డంకులను సూచిస్తుంది. ఇక ఎప్పటిలానే నితిన్ నటన మరో స్థాయిలో ఉంది. అలాగే, ప్రియా ప్రకాష్ వారియర్‌తో రొమాంటిక్ యాంగిల్‌ను కూడా ట్రైలర్లో టచ్ చేశారు. మొత్తంగా ట్రైలర్ చూస్తుంటే సినిమా కచ్చితంగా సూపర్ హిట్ గా నిలుస్తుంది అనిపిస్తోంది.