మెగా హీరో వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’ ఈ ప్రేమకథా చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విజయ్‌సేతుపతి విలన్‌గా కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ సైతం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తాజాగా.. సినిమా ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ‘ఆల్ ది బెస్ట్ బ్రదర్’ అని ఎన్టీఆర్ అన్నారు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘ప్రేమంటే ఓ లైలా-మజ్నులా, దేవదాసు-పార్వతిలా, రొమియో-జూలియట్‌లా అదో మాదిరిలా ఉండాలిరా’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ప్రారంభమవ్వగా.. ప్రేమ, ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో పడే కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే విలన్ పాత్రలో విజయ్ సేతుపతి చెప్పే డైలాగులు, ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘ప్రేమ గొప్పదైతే చరిత్రలోని, సమాధుల్లోని కనపడాలి కానీ.. పెళ్లిచేసుకుని, పిల్లల్ని కని, ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదూ. అందుకే, ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటది. దానికి భవిష్యత్తు ఉండదు. ఏటి ’ అంటూ విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్ గా నిలిచింది. కాగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.