‘బాహుబలి’, ‘సాహో’తో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. ఇటలీ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రాధే శ్యామ్’ ఫస్ట్‌లుక్, టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక టీజర్ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ‘డార్లింగ్’ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే వచ్చే వారంలో రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ అనౌన్స్మెంట్ చేయనున్నారంట. ఈ మేరకు వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో తెగ హల్చల్ చేస్తోంది. అంతేకాకుండా పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా టీజర్‌ను ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) రోజున విడుదల చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి లవర్స్ డే రోజున ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తారన్న విషయం ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా.. భారీ బడ్జేట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతానని అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజ హేగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.