Home సినిమాలు యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 'శేఖర్' ఫస్ట్‌లుక్ రీలీజ్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ‘శేఖర్’ ఫస్ట్‌లుక్ రీలీజ్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘శేఖర్’.కొత్త డైరెక్టర్ లలిత్ దర్శకత్వంలో  తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అనూప్ రుబెన్స్ సంగీతం అందించనున్నారు. కాగా ఈ రోజు (ఫిబ్రవరి 4) రాజశేఖర్ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా ‘శేఖర్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు చిత్రబృందం. తెల్ల గెడ్డంతో రఫ్‌లుక్‌లో ఉన్న రాజశేఖర్ ఫొటోను ఫస్ట్‌లుక్‌గా వదిలారు. కాగా..ఫిబ్రవరి మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

ఇదిలావుండగా..ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర అనారోగ్యం పాలైన రాజశేఖర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కోలుకుని బయటకు వచ్చిన ఆయన తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించారు. తను అనారోగ్యానికి గురైన సమయంలో అండగా నిలిచిన అభిమానులకు రాజశేఖర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల మద్దతు వల్లే పుట్టిన రోజునాడు కొత్త సినిమాను ప్రారంభించగలుగుతున్నానని పేర్కొన్నారు.

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు