Home సినిమాలు రవితేజ ‘ఖిలాడి’ కోసం రంగంలోకి దిగిన అనసూయ!

రవితేజ ‘ఖిలాడి’ కోసం రంగంలోకి దిగిన అనసూయ!

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా రూపొందుతోన్న ‘ఖిలాడి’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. కాగా, ఈ చిత్రంలో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కథని మలుపు తిప్పే ఓ కీలక పాత్రను ఆమె పోషించబోతుందని తెలిపింది. అంతేకాదు ఆమె ఇందులో రవితేజతో కలిసి ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడనుందట. ఓ వైవిధ్యభరిత యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

కాగా..గతకొన్ని రోజులుగా విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ‘ఖిలాడి’ షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పాల్గొనడానికి అనసూయ విశాఖపట్నం వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పెన్ స్టూడియోస్ పతాకంపై కోనేరు సత్యనారాయణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు