Home సినిమాలు 'ఆర్‌ఆర్ఆర్‌' నుంచి మరో సర్‌ప్రైజ్‌

‘ఆర్‌ఆర్ఆర్‌’ నుంచి మరో సర్‌ప్రైజ్‌

ఎన్టీఆర్-రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలోఅల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు.బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ చరణ్ కు జోడీగా సీత పాత్రలో సందడి చేయనున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు.దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా..‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సంబంధించిన క్లైమాక్స్‌ మొదలు పెట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, సినిమాకు సంబంధించిన విశేషాలను ‘ఆర్ఆర్ఆర్‌ డైరీస్‌’ పేరుతో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేస్తూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఫొటోలను షేర్‌ చేసింది చిత్రబృందం. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా శక్తిమంతమైన క్లైమాక్స్‌ కోసం ప్రాక్టీస్ సెషన్స్’’ అంటూ ఎన్టీఆర్, చరణ్ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను ఉంచింది. ఆ ఫోటోలు అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ అలరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన నటిస్తున్న ఓలీవియా మోరిస్‌ ఫస్ట్‌లుక్‌ చిత్ర బృందం పంచుకుంది.

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు