దర్శకుడు : ప్రశాంత్ వర్మనిర్మాత : రాజశేఖర్ వర్మసంగీతం : మార్క్ కె. రాబిన్ నటీనటులు : తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్, పృథ్వీ రాజ్, హరితేజ, రఘుబాబు,గెటప్ శ్రీను
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో డిఫరెంట్ స్టోరీ ‘జాంబి రెడ్డి’ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్ర అప్డేట్స్ సినిమాపై సరికొత్త ఆసక్తి రేకెత్తించాయి. పైగా తెలుగులో వస్తున్న తొలి జాంబి సినిమా కావడంతో ఈ మూవీ ఎలా ఉండబోతోంది.. జాంబిలను ప్రశాంత్ వర్మ ఎలా చూపించనున్నారు.. అనే కుతూహలం ప్రేక్షకుల్లో నెలకొంది. కాగా..ఈ చిత్రం ఈ రోజు(ఫిబ్రవరి5న) విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
ప్రముఖ గేమ్ డిజైనర్ అయిన మ్యారియో (తేజ సజ్జ) తన స్నేహితులైన దక్ష నగార్కర్, కిరీటితో కలిసి రాయలసీమలో స్నేహితుడు ఆర్జే హేమంత్ వివాహానికి బయల్దేరుతారు. ఈ ప్రయాణంలో వారికి అనుకోని సంఘటన ఎదురవుతుంది. కానీ ఇది వారి జీవితాలనే ప్రమాదంలో పడేస్తుందనేది వాళ్ళకి అప్పుడు అర్థం కాదు. కానీ తీరా పెళ్లికి వెళ్లాక గ్యాంగ్‌లోని కిరీటి జాంబీగా మారిపోతాడు. అతడు ఒక్కడే కాదు ఆ ఊర్లోని వాళ్లంతా జాంబీలుగా మారుతుంటారు. తేజ, ఆనంది, దక్షా, గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్ మాత్రమే మాములు మనుషులుగా ఉంటారు..మరి ఈ వీళ్లు ఊళ్లో ఉన్న వాళ్లను తిరిగి మామూలు మనుషులను చేయగలిగారా.. లేదంటే వీళ్లు కూడా జాంబీలుగా మారిపోయారా.. అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..
విశ్లేషణ:
‘జాంబి రెడ్డి’ అంటూ వచ్చిన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలతో పాటు మంచి టేకింగ్ మరియు ఇంట్రస్ట్ గా సాగే కొన్ని ట్రాక్స్ అలాగే కొన్ని జాంబి హారర్ సీన్స్ సినిమాలో బాగా ఆకట్టుకుంటాయి. కాకపోతే రెగ్యులర్ కామెడీ, రొటీన్ హర్రర్ ఎలిమెంట్స్ కొన్ని చోట్ల బోర్ గా అనిపించినా… మొత్తంగా ప్రేక్షకులకు కు మాత్రం ఈ సినిమా నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్ :తేజ, దక్షా, గెటప్ శ్రీను నటనఇంటర్వెల్ ట్విస్ట్
మైనస్ పాయింట్స్సాగదీత సీన్లు క్లైమాక్స్
రేటింగ్: 3.5