మాస్ మహారాజా రవితేజ ఈ వేసవికి మరోసారి తన పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం రాక్షసుడు చిత్ర దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’ మే 28న విడుదలకు సిద్ధమవుతోంది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాత. డా. జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా, డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
కాగా..’ఖిలాడీ’ మూవీలో బాలీవుడ్ నటుడు నికితిన్ ధీర్ నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా మరో అప్టేడ్తో ముందుకొచ్చింది. నికితిన్ ధీర్ స్వాగతం చెబుతూ ట్వీట్ చేసింది. అంతేకాదు ఈ సినిమాలో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ నటిస్తోందంటూ అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం ఆమెను ఆహ్వానిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.