ఓ సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ఫోన్ చేశాడని తెలుస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఓ కథ విషయంపై మాట్లాడిన రామ్ చరణ్.. వరుణ్ తేజ్ ను ఆ సినిమా చేయమని చెప్పడంతో వరుణ్ తేజ్ కూడా దానికి ఒకే చెప్పారట. తాను చేయాలనుకునే ఓ మంచి సినిమాను వరుణ్‌కి అప్పగిస్తూ తమ్ముడికి చరణ్ కొన్ని సలహాలిచ్చారని తెలుస్తోంది.
కాగా..తెలుగు చిత్రసీమలోని ఓ బడా నిర్మాత రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసి కథ కూడా సిద్ధం చేశారట. ఆ కథను రామ్ చరణ్, చిరంజీవిలకు వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. అయితే అనుకోకుండా ప్రస్తుతం చరణ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఆలస్యం కావడంతో ఆ కథను వరణ్ తేజ్ చేస్తే బావుంటుందని భావించిన రామ్ చరణ్ తమ్ముడు వరుణ్‌కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని సమాచారం. చిరంజీవి మెచ్చిన కథ కాబట్టి దీనిపై వరుణ్ కూడా ఆ నిర్మాతకు ఓకే చెప్పారని తెలుస్తోంది.అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కాగా..ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ‘గని’ చిత్రంలో నటిస్తున్నాడు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరణ్ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. బాక్సింగ్ రింగ్‌లో పంచులు కొడుతున్న వరుణ్ లుక్ అభిమానులను ఎంతగానో అలరించింది. జూలై 30న ‘గని’ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రబృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.