Home సినిమాలు అల్లరి నరేష్ ‘నాంది’: స్నేహితుని కోసం బరిలోకి దిగిన మహేశ్

అల్లరి నరేష్ ‘నాంది’: స్నేహితుని కోసం బరిలోకి దిగిన మహేశ్

అల్లరి నరేష్ విభిన్న పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘నాంది’. ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నారు. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, ప్రియదర్శి, హరీశ్‌‌.. తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవ‌రి 19న విడుదల చేస్తున్నారు.

కాగా..’నాంది’ ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ మహేశ్‌ తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్‌ చాలా అద్భుతంగా ఉందని చెప్పిన మహేశ్‌ అల్లరి నరేశ్‌ సహా ఎంటైర్‌ యూనిట్‌కు సినిమా సక్సెస్‌ కావాలని అభినందనలు తెలిపారు.ఇక క్రైమ్‌, థ్రిల్లింగ్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది..రాజగోపాల్‌ గారిని నేను మర్డర్‌ చేయడం ఏమిటి సర్‌. ఇప్పటివరకూ రాజగోపాల్‌ గురించి వినడం తప్పా ఆయన గురించి నాకేం తెలీదు’ అంటూ నరేశ్‌‌ చెప్పే డైలాగులతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. నరేశ్‌‌ నిజంగానే రాజగోపాల్‌ అనే వ్యక్తిని హత్య చేశారా.. లేక చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించాడా..అసలింతకీ ఈ రాజగోపాల్‌తో నరేశ్‌‌కు ఉన్న సంబంధం ఏమిటి అన్నది తెలియాలంటే ఫిబ్రవరి19 వరకు వేచి చూడాల్సిందే.

ఇదిలావుండగా..అల్లరి నరేష్, మహేష్ బాబు ఇద్దరు మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ‘మహర్షి’ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు తన స్నేహితుడి సినిమాకు పబ్లిసిటీ చేయడానికి మహేష్ బాబు రంగంలోకి దిగారు. మహేష్ బాబు ట్రైలర్ రిలీజ్ చేయడం వల్ల ‘నాంది’కి ఇండస్ట్రీలో క్రేజ్ మరింత పెరిగింది.

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు