Home సినిమాలు ఉత్కంఠగా 'దృశ్యం2’ ట్రైలర్‌

ఉత్కంఠగా ‘దృశ్యం2’ ట్రైలర్‌

మలయాళీ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దృశ్యం-2’. 2014లో విడుదలైన ‘దృశ్యం’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో 2014లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇతర భాషల్లో రీమేక్‌ అయి రికార్డు సృష్టించింది.కాగా..జితూ జోసఫ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనా కీలకపాత్రను పోషిస్తున్నారు.ఆశీర్వాద్‌ సినిమాస్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ వేదికగా ఫిబ్రవరి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దృశ్యం’లో క్లోజ్‌ చేసిన కేసును మళ్లీ రీ ఓపెన్‌ చేశారా..లేక ఇది ఇంకో సమస్యా..అయితే, అదేేంటి  అందుకు జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్‌) ఏం చేశాడన్నది తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అంతకుముందు దృశ్యం’ పేరుతో తెలుగులో వెంకటేశ్‌, మీనా నటించగా, హిందీలో అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియలు నటించారు. తెలుగు, హిందీ భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ‘పాపనాశం’ పేరుతో కమల్‌హాసన్‌, గౌతమిలు నటించారు.కాగా..మలయాళ ‘దృశ్యం’ విడుదలైన నాటితో పోలిస్తే ఇప్పుడు మోహన్‌లాల్‌ నటనా పరిధి పెరిగింది. ఇతర భాషల్లోని సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా, ఆయన నటించిన ‘మన్యం పులి’, ‘లూసిఫర్‌’ చిత్రాలు తెలుగులోనూ అలరించాయి.

అత్యంత ప్రముఖమైనవి

మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు

ప్రధాని మోదీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు చేరింది. మార్చి తొలి వారంలో జరుగనున్న అంతర్జాతీయ ఇంధన వార్షిక సదస్సులో సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్...

కరోనా వాక్సిన్ ధర – 250/- గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా కొత్త స్ట్రైన్ వ్యాపించే అవకాశం ఉన్నందున, కేంద్రం వాక్సిన్ ను పబ్లిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగం గా ధరను 250 రూపాయలుగా నిర్ణయించింది. ...

‘మాస్టర్’ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్‌ చేసింది. బాహుబలి 2తో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్‌...

ఇండియా లెజెండ్స్ క్రికెట్ – మార్చ్ 5 నుంచి

రహదారి భద్రతా ప్రపంచ సిరీస్ లో భాగం గా మార్చ్ 5 న ఈ సిరీస్ ప్రారంభమవుతోంది.  ఆయా దేశాల మాజీ క్రికెటర్ లు ఈ సిరీస్ లో ఆడనున్నారు. ...

ఇటీవలి వ్యాఖ్యలు