యావత్తు భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాగా..ఈ సినిమా తొలి భాగం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రూ .200 కోట్ల వసూళ్లు చేసిన తొలి కన్నడ సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారని సమాచారం.అలాగే కన్నడలో ఈ సినిమాను 100 కోట్లకు పైగా అమ్మడానికి చూస్తున్నారని తెలుస్తోంది. ఇక తెలుగులో కూడా ఏకంగా 70 కోట్లు చెప్తున్నారని తెలుస్తోంది. మరోవైపు హిందీలో కూడా ఈ సినిమాకు 50 కోట్లకు పైగానే రైట్స్ చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కెజిఎఫ్ 2 సినిమా బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుందని సమాచారం.
కాగా, ఈ చిత్రాన్ని కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. ఇదిలా ఉంటే, రాఖీ భాయ్‌ని ఢీకొట్టే అధీర పాత్రను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పోషించారు. మరో కీలక పాత్రలో రవీనా టాండన్ కనిపించనున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఇంకా ప్రకాశ్ రాజ్, అనంత్ నాగ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫి అందించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు.