పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ కి ఇది 28 వ చిత్రం కావడం విశేషం.. ఇక ఇప్పటికే పవన్, హరీష్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మళ్ళీ ఇదే కాంబినేషన్ నుంచి ఎనిమిదేళ్ళ తరవాత సినిమా వస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో హరీష్ శంకర్‌ని చాలా మంది ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందని అడుగుతున్నారట. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ..”పవన్ కళ్యాణ్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని చాలా మంది అడుగుతున్నారు. అప్డేట్ కాదు అప్ టూ డేట్ అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. సమయం వచ్చినప్పుడు ఆ సినిమా గురించి తప్పక చెబుతాను” అని హరీష్ శంకర్ ఉప్పెన వేదికగా మాట్లాడాడు. కాగా..వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ .. క్రిష్ సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు పూర్తయ్యాక హరీష్ శంకర్ మూవీ మొదలు పెట్టనున్నాడు.
కాగా..అంతకుముందు ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. హరీష్ శంకర్ తన స్పీచ్‌తో అదరగొట్టారు. మెగాస్టార్ ముందే మెగా పంచ్‌లు పేల్చారు.హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వస్తున్నప్పుడు బయట చిరంజీవి గారి కటౌట్ కనిపించింది. మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడ మొగల్తూరు.. ఎక్కడ చెన్నై.. ఎక్కడ ప్రయాణం.. ఎంతటి ప్రస్థానం.. వైష్ణవ్ తేజ్ వరకూ వచ్చింది.. ఇంకెంత దూరం వెళ్తుందో.నిజంగా భారతదేశంలో రాజ్ కపూర్ గారి తరువాత అంతటి అదృష్టం మళ్లీ మీకే (చిరంజీవి) దక్కింది సార్. ఈ అదృష్టం రాసిపెట్టి ఉండాలంతే. ఒక ఫ్యామిలీని ఇంతలా ఆదరించడం అంటే అది పూర్వజన్మ సుకృతం అని హరీష్ శంకర్ పేర్కొన్నాడు.