స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ తొలిసారి పూర్తిస్థాయి మాస్ రోల్లో మెప్పించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న విడుదల చేస్తున్నారు.
కాగా..ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన తాజా అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది. గతేడాది నవంబర్ నుంచి షూటింగ్ చేస్తున్నామని తెలియజేసిన యూనిట్ సభ్యులు మారేడు మిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారట. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్ పూర్తయ్యాయి. మేం షూటింగ్ జరిపిన ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, అధికారుల సహకారంతో షూటింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తయ్యింది. మీకు ధన్యవాదాలు. మళ్లీ కలుద్దాం అంటూ ‘పుష్ప’ చిత్రయూనిట్ పేర్కొంది.
ఇదిలావుండగా..ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పోస్టర్లోనూ బన్నీ పుష్పరాజ్ అనే స్మగ్లర్‌గా మాస్ లుక్‌లో కనిపించాడు.హీరో కూలీ నుంచి స్మగ్లర్‌గా ఎలా మారాడన్నదే కథ. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ మూవీ తర్వాత బన్నీ కొరటాల శివ డైరెక్షన్లో వచ్చే ఓ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.