Home సినిమాలు ‘జాంబి రెడ్డి’ వసూళ్లు: రెండో రోజు కూడా సూపర్ స్ట్రాంగ్

‘జాంబి రెడ్డి’ వసూళ్లు: రెండో రోజు కూడా సూపర్ స్ట్రాంగ్

అ!’, ‘కల్కీ’ వంటి వినూత్నమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ. ఈసారి మరో అడుగు ముందుకేసి మరింత భిన్నమైన చిత్రాన్ని మనముందుకు తీసుకొచ్చాడు. ఇప్పటి వరకూ హాలీవుడ్‌కే తెలిసిన జాంబీలను తెలుగు తెరపై చూపించాడు. బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించగా..ఆనంది, దక్ష నగార్కర్‌ హీరోయిన్లుగా నటించారు. జబర్దస్త్‌ గెటప్‌ శ్రీను, పృథ్వీరాజ్‌ కీలకపాత్రలు పోషించారు. మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూర్చారు. అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీ అందించారు. సాయిబాబు తలారి ఎడిటర్.

అయితే ఫిబ్రవరి 5న 500 వందలకు పైగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.విడుదలకు ముందే ‘జాంబి రెడ్డి’కి మంచి ప్రచారం కల్పించడం, తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్‌తో పాటు రెండో రోజు కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.4.63 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంటే, ఈ మొత్తంలో డిస్ట్రిబ్యూటర్ షేర్ విలువ రూ.2 కోట్ల పైనే ఉంటుంది.

కాగా..‘జాంబి రెడ్డి’ తొలి రోజు రూ.2.26 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీనిలో రూ.1.03 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ఉంటుంది. అలాగే తొలి మూడు రోజులు ముగిసే సరికి సుమారు రూ.3 కోట్ల షేర్‌ను ఈ సినిమా వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పటికే రెండు రోజుల్లో రూ.2 కోట్ల పైనే షేర్‌ను ఈ సినిమా వసూలు చేసింది. అలాగే..సినిమాకు పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి మూడో రోజు మరో కోటి రూపాయలు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు