పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ చిత్రం “సలార్”. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ మధ్యే ‘సలార్’ షూటింగ్ రామగుండంలో ప్రారంభమైన విషయం తెలిసిందే.హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్లో కనిపించనున్నారు.భారీ బడ్జెట్ తో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు.ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా..ఈ సినిమాకు సంబంధించి ఓ సరికొత్త వార్త ప్రస్తుతం అభిమానుల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ మేరకు ‘సలార్’ కోసం స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. అటు బాలీవుడ్ ఇటు హాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రియాంక.. ప్రస్తుతం ఈ రెండు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘సలార్’కు మరింత క్రేజ్ తెచ్చేందుకు ప్రియాంకా చోప్రాను రంగంలోకి దించాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. ఈ మేరకు ప్రియాంక ‘సలార్’లో ఓ స్పెషల్ సాంగ్ లో ప్రభాస్ తో కలిసి స్టెప్పులేయనుందని సమాచారం. అయితే, ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.