పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రానున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. కన్నడ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రుతిహాసన్‌కు హీరోయిన్ గా అవకాశం దక్కింది. కాగా..హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఇటీవల ప్రారంభమైన షెడ్యూల్లో ప్రభాస్-శ్రుతిహాసన్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
అయితే, ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంలో గత కొన్నిరోజులుగా పలువురు నటుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాను ‘సలార్’లో నటిస్తున్నానని పేర్కొంటూ కన్నడ నటుడు మధూ గురుస్వామి తాజాగా ప్రకటించాడు.. ‘సలార్’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నాను. నాకు ఇలాంటి గొప్ప అవకాశాన్ని అందించిన దర్శకుడు ప్రశాంత్‌నీల్, నిర్మాత, నిర్మాణ సంస్థలకు ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మధూ గురుస్వామి.. ‘సలార్’లో విలన్‌గా కనిపించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ‘సలార్’కు సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అదేమిటంటే.. చిత్రబృందం ప్రభాస్ ఎంట్రీని గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఫైట్ సీక్వెన్స్‌తో రూపుదిద్దుకోనున్న ఈ ఒక్క సీన్ కోసమే భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. ఈ సినిమాలో మొత్తం ఆరు ఫైట్లు ఉన్నాయని, ప్రభాస్-శ్రుతిహాసన్ మధ్య తెరకెక్కే సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయని సినీ పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు పలు పోస్టులు అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.