మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. మే 13న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాపై ఇటు మెగా అభిమానులతో పాటు అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే నైజాం థియేట్రికల్ హక్కులను వరంగల్ శ్రీను రూ.42 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం..అలాగే తాజా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ద్వారానే ‘ఆచార్య’ రూ.120 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. అలాగే ‘ఆచార్య’ సినిమా ఓవర్సీస్ హక్కులను ప్రముఖ సంస్థ ఫారస్ సంస్థ రూ.11 కోట్లకు దక్కించుకుందని సమాచారం. కరోనా మహమ్మారి నుంచి కొలుకున్న చిత్ర పరిశ్రమ ఇప్పుడిపుడే గాడినపడుతుంది. ఈ నేపథ్యంలో సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ ఎలా ఉంటాయోనని అందరిలో తెలియని ఓ ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో ‘ఆచార్య’ సినిమాకు ఓవర్సీస్లో భారీ రికార్డ్‌తో బిజినెస్ డీల్ పూర్తయ్యింది. ఫారస్ సంస్థ భారీ మొత్తం చెల్లించి ‘ఆచార్య’ హక్కులను దక్కించుకోవడం ఇప్పటి పరిస్థితుల్లో ఓ రికార్డ్ అంటూ సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.