Home సినిమాలు అఖిల్‌‌ అక్కినేనితో 'ఉప్పెన' బ్యూటీ రొమాన్స్‌కు లైన్ క్లియర్..

అఖిల్‌‌ అక్కినేనితో ‘ఉప్పెన’ బ్యూటీ రొమాన్స్‌కు లైన్ క్లియర్..

ఉప్పెన సినిమాలో కథానాయికగా నటించిన కృతి శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో  బిజీగా ఉంది.ఇప్పటికే ఈమె చేతిలో దాదాపుగా అర డజనుకు పైగా సినిమాలు ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక్క సినిమాతోనే ఇంతగా ఆఫర్లు దక్కించుకుంటున్న అరుదైన హీరోయిన్ గా 17 ఏళ్ల కృతి క్రేజ్ దక్కించుకుంది. ఇప్పటికే ఈమె నాగశౌర్య కు జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. ఇక తమిళ స్టార్ హీరో సూర్య నటించబోతున్న సినిమాలో కూడా ఈమెను ఎంపిక చేసినట్లుగా సమాచారం. అలాగే  సుధీర్ బాబు సినిమాలో హీరోయిన్ గా కమిట్ అయిన ఈ బ్యూటీకి ఇప్పుడు అఖిల్ అక్కినేని సినిమాలోనూ అవకాశం వచ్చిందని సమాచారం. 

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో కృతినే హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం అఖిల్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాడు. ప్రస్తుతం అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూన్ 19న విడుదల కానుంది. గీతా ఆర్ట్స్  ఈ సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.పూజా హెగ్డే ఇందులో అఖిల్ కు జోడీగా నటిస్తుంది.

అత్యంత ప్రముఖమైనవి

మెగా డాట‌ర్ నిహారిక కొత్త సినిమా.. ముఖ్య పాత్రలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆరుముగ కుమార్‌...

‘నాంది’ 7 రోజుల కలెక్షన్స్: మోత మోగిస్తోన్న అల్లరోడు

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఉవ్విళ్లూరుతున్నాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో...

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణ మురళీ తదితరులు నిర్మాతలు : వి. ఆనంద...

ఆస్కార్ రేసులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’.. పట్టరాని ఆనందంలో అభిమానులు

సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'.  లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య...

ఇటీవలి వ్యాఖ్యలు