Home సినిమాలు ‘ఉప్పెన’పై పవన్‌ కల్యాణ్‌ ఏమ‌న్నాడంటే..!

‘ఉప్పెన’పై పవన్‌ కల్యాణ్‌ ఏమ‌న్నాడంటే..!

మెగా కాంపౌండ్ నుంచి వస్తోన్న మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్.. ‘ఉప్పెన’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. 

ఈ సందర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆయన సినిమా విశేషాలతో పాటు..తన మేన మామా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమా గురించి ఏమన్నారో కూడా తెలిపారు. ఈ క్రమంలో వైష్ణవ్ మాట్లాడుతూ.. ”పవన్ మామకు నేను ఉప్పెన అనే సినిమా చేస్తున్నానని తెలుసు కానీ.. సినిమా కథ గురించి మాత్రం ఏమీ తెలియదు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ చూసి.. బాగుందని చెప్పారు. సినిమాలో అందరూ చాలా బాగా చేశారని అన్నారు. నీ వంతుగా ప్రతి సినిమాకు బాగా కష్టపడు తప్పకుండా విజయం దక్కుతుంది.” అని చెప్పుకొచ్చారు.

అలాగే మా పెద్ద మామా చిరంజీవి గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అవకాశాన్ని గౌరవించాలని చెప్పారు. అవకాశం కోసం చాలా మంది బయట ఎదురుచూస్తున్నారని.. నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని అన్నారు. ఒకసారి ప్రయత్నించి చూడు నీ వల్ల కాకపోతే వదిలేయ్ అన్నారు. అంతకు ముందు నాకెవరూ అలా చెప్పలేదు అని వైష్ణవ్ తేజ్ వెల్లడించాడు.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు