నందమూరి నటసింహ బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా… ద్వారక క్రియేషన్స్ బ్యానర్పైమిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను మే 28న విడుదల చేయనున్నట్టు నిర్మాత ప్రకటించారు. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతానికి పిలుస్తున్నారు.
ఇదిలావుండగా.. ఈ సినిమా తరవాత స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్నారని సమాచారం. ఉగాది సందర్భంగా ఏప్రిల్ నెలలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే 2022 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో ఉంటుందని తెలుస్తోంది.కాగా,గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మాస్ మహారాజా రవితేజతో హ్యాట్రిక్ కొట్టారు. మరి ఇప్పుడు బాలయ్య కోసం ఆయన ఎలాంటి కథ సిద్ధం చేశారో అన్నది చూడాలి.