‘ఇంద్ర’లో చిన్ననాటి చిరంజీవిగా.. ‘కలిసుందాం రా’లో చిరువెంకటేశ్గా.. ఇలా ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోలకు బ్యాక్‌డ్రాప్ పాత్రలను పోషించి మెప్పించిన నటుడు తేజ సజ్జ. చాలాకాలం తర్వాత ఇటీవల ‘ఓబేబీ’లో కీలకపాత్ర చేసి అలరించాడు. ఇప్పుడు ఓ వినూత్నమైన చిత్రం ‘జాంబీరెడ్డి’తో హీరోగా వచ్చాడు. డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆనంది, దక్ష నగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
కాగా..‘జాంబీరెడ్డి’ మూవీ తొలి మూడు రోజులు పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్‌కి దగ్గరైందని తెలుస్తోంది. తొలి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 1.5 కోట్ల గ్రాస్, 91 లక్షల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు అదే జోరు కొనసాగించింది. మొత్తంగా రెండు రోజుల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ.4.63 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ విలువ రూ.2 కోట్ల పైనే ఉందని తెలిసింది. ఇక మూడో రోజు వీకెండ్ (ఆదివారం) కావడంతో కలెక్షన్స్‌లో పెద్దగా మార్పు కనిపించలేదు.
మొత్తంగా మూడో రోజుకు గాను 1.6 కోట్ల నెట్, 2.85 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక మొత్తంగా చూస్తే తొలి మూడు రోజులు ముగిసేసరికి మొత్తంగా 4.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. కాగా, ‘జాంబీరెడ్డి’ కలెక్షన్ల జోరు చూస్తుంటే మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా,‘జాంబీరెడ్డి’ సినిమాప్రాంతాల వారీగా మూడో రోజు కలెక్టన్ రిపోర్ట్ పరిశీలిస్తే..
నైజాం- 56 లక్షలుసీడెడ్- 29 లక్షలుఉత్తరాంధ్ర- 17 లక్షలుగుంటూరు-16 లక్షలుకృష్ణా- 14.4 లక్షలుతూర్పు గోదావరి- 10 లక్షలుపశ్చిమ గోదావరి- 9 లక్షలునెల్లూరు- 9 లక్షలు