Home సినిమాలు ప్రభాస్ 'రాధేశ్యామ్‌' రిలీజ్ ఎప్పుడంటే..?

ప్రభాస్ ‘రాధేశ్యామ్‌’ రిలీజ్ ఎప్పుడంటే..?

నేషనల్ స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న వింటేజ్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. ఇందులో ఆమె ప్రేరణ అనే పాత్రలో కనిపించనున్నారు. అలనాటి బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళీశర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్‌’పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు.ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందిస్తుండగా, మనోజ్‌ పరమహంస తన కెమెరా పనితనాన్ని చూపెట్టనున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

కాగా..ఈ సినిమా విడుదల గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జూలై 30న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్‌ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని కంటే ముందు, తర్వాత రెండు స్టార్ హీరోల సినిమాలు విడుదలవబోతున్నాయి. జూలై 19న రాక్ స్టార్ యశ్ ‘కేజీఎఫ్‌ 2’, ఆగస్టు 13న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ‘పుష్ప’ రిలీజ్ అవబోతున్నాయి. అయితే..ఈ రెండింటితో క్లాష్ అవకుండా ఉండేందుకు మధ్యలో ఉన్న జూలై 30ని ఎంచుకుంటున్నట్లు సమాచారం. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

గింగిరాల పిచ్ పై భారత్ వికెట్ల తేడాతో విజయం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ స్టేడియం లో భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవది మరియు...

ఇటీవలి వ్యాఖ్యలు